కాని తర్వాత రోజుల్లో మా తల్లిదండ్రులిద్దరూ ఒక్కసారే మమ్మల్ని విడిచి వెళ్ళిపోయినప్పుడు తిరిగి చిత్రలేఖనం రూపంలో ఆయనే నన్ను అక్కున చేర్చుకున్నారు.
పునర్యానం-11
పునర్యానం మొదటి అధ్యాయంలో మొత్తం అయిదు సర్గలు, 102 కవితలు ఉన్నాయి. వాటిల్లో నా చిన్నప్పటి అనుభవాల్నీ, ఆ తర్వాత నేను చూస్తూ వచ్చిన సౌందర్యాన్నీ కవితలుగా మార్చడానికి ప్రయత్నించాను. వాటిల్లోంచి చిన్న కవితలు, అనువాదానికి వీలుగా ఉండే కవితలు మాత్రమే మీతో పంచుకుంటున్నాను. ఆ వరసలో మరొక కవితతో, ఆ అధ్యాయాన్ని ముగిస్తున్నాను.
పునర్యానం-10
ఈ కవితలో 'పువ్వు నుంచి పట్టుకు చేరేలోపే మత్తెక్కి కూలుతున్నాయి మధుపాలు' అనే వాక్యం రాసినప్పుడు రామాయణ వర్ణన నాకు తెలియదు. కానీ ఆ వర్ణన చదివినప్పుడు, నాకు కూడా ఇటువంటి ఊహ కలిగినందుకు నాకెంత సంతోషం కలిగిందో చెప్పలేను.
