అన్నార్తుడి వాయులీనం

పుస్తకం తెరిచి ఒకటి రెండు గీతాలు చదివేనో లేదో, ఆ ఇంగ్లీషు మాటలు నా అంతరంగంలో తెలుగుపదాలుగా మారిపోతూ తుమ్మెదల్లా నా చుట్టూ ఝుమ్మని ముసరడం మొదలుపెట్టాయి.

బహిరిసన్స్ బుక్ సెల్లర్స్

బహిరిసన్స్ నన్ను నిరాశ పర్చలేదు. హైదరాబాదు, విజయవాడ పుస్తక ప్రదర్శనలు రెండింటిలోనూ కలిపి కూడా నాకు కనిపించనంత కవిత్వం, కొత్తదీ, పాతదీ కూడా ఇక్కడ నాకు కనిపించింది.

మీకు కొన్ని సంగతులు చెప్పాలి

'ద పొయెట్రీ ఆఫ్ అవర్ వరల్డ్ ' (పెరిన్నియల్, 2000) చాలా విలువైన పుస్తకం. ' ద వింటేజి బుక్ ఆఫ్ కాంటెంపరరీ వరల్డ్ పొయెట్రీ ' (1996), 'వరర్ల్డ్ పొయెట్రీ' (నార్టన్,1997) లతో పాటు ప్రతీ రోజూ నాకు నా స్పూర్తినివ్వడానికి నా బల్లమీద పెట్టుకునే పుస్తకంగా మారిపోయింది.