పాట చాలా చిత్రమైనది. ఒకరికి అది జయమాల, మరొకరికి ఉరితాడు. ఒకరినది అందలమెక్కిస్తుంది. పద్మశ్రీ, పద్మవిభూషణుల్ని చేస్తుంది. మరొకరిని ప్రవాసానికీ, కారాగారానికీ పంపిస్తుంది. కాని, శ్రోతల్ని మాత్రం ఒక్కలానే పరవశింపచేస్తుంది.
లలన లీల
రామకృష్ణ కథామృతం చదివినవాళ్ళకి రామ ప్రసాద్ ఎవరో తెలుసుకోవాలనీ, అతడి కీర్తనల్ని వినాలనీ గొప్ప కుతూహలం కలుగుతుంది. ఆ కుతూహలం వల్లనే గత వందేళ్ళుగా ఎందరో పండితులు, పరిశోధకులు అతడి భక్తిగీతాల్ని ఇంగ్లీషులో, ఫ్రెంచిలో అనువదిస్తూనే ఉన్నారు