ఈ రోజు నా సమస్య కూడా అదే. ఈ విద్వేషాగ్నితో రగులుతున్న ఈ ప్రపంచంలో నా కర్తవ్యం ఏమిటి? కవిత్వం రాసుకుంటూ ఉండటమా లేక పూర్తి స్థాయి కార్యకర్తగా వ్యవస్థతో తలపడటమా?
రాతిమీద చెక్కిన పువ్వు
ఈ ప్రపంచంలో ఇంకా చెప్పుకోదగ్గది ఏది మిగిలిఉందో- ఒక వర్ణచిత్రం, రాతిమీద చెక్కిన పువ్వు, ఒక లలితగీతం, నేలబారు మనుషులు అందుకోలేని గొప్ప భావం- ప్రతి ఒక్కటీ ఒక విలాసం కిందనే లెక్క. విలాసం అత్యున్నతమానవుడి అత్యంత ప్రాథమిక అవసరం.
