అది అన్నిటికన్నా ముందు ప్రేమ. ప్రేమావస్థ, మనుషుల మధ్యనైనా, మనిషికీ, భగవంతుడికీ మధ్యనైనా ఒక్కలానే ఉంటుంది. కాకపోతే మనుషుల మధ్య ప్రేమ స్థిరం కాకపోవచ్చు. కానీ, ఆ ప్రేమ కలిగిన క్షణాన, ఒక మనిషి మరొక మనిషి పట్ల లోనుకాగల పారవశ్యానికీ, భగవత్ప్రణయ పారవశ్యానికీ మధ్య తేడా ఏమీ ఉండదు.
కబీరు-4
బీజక్ లో కనబడే కబీర్ చాలా సూటి మనిషి. అందులో ఆయన తనతో తాను మాట్లాడుకోడు, లేదా దేవుడితోనో, రాముడితోనో మాట్లాడడు. నేరుగా తన కాలం నాటి సాధువుల్ని, సంతుల్ని, సజ్జనుల్ని ఉద్దేశించి మాట్లాడతాడు. చాలాసార్లు పండితుల్ని,కాజీల్ని రెచ్చగొడతాడు, ప్రశ్నిస్తాడు, ఎండగడతాడు.
కబీరు-5
నిన్ను అహర్నిశం వెంటాడుతున్న మృత్యువునుంచి నిన్ను కాపాడగలిగేది ఆ శబ్దం మాత్రమే. దాన్నే అతడు గురువు, హరి, సారంగపాణి,మధుసూధనుడు లాంటి పదాలతో సూచిస్తాడు. అన్నిటికన్నా ముఖ్యంగా రాముడు. ఈ రాముడు దశరథ తనయుడు కాడు. ఇతడు సర్వాంతర్యామి కాగా దశరథ రాముడు ఒక దేహధారి మాత్రమే
