కాబట్టి ఇటువంటి కాలంలో ఒక సోమశేఖర శర్మ ప్రభవించడం అలా ఉంచి ఆయన్ని తలుచుకోవడం కూడా అసంభవం కావడంలో ఆశ్చర్యం లేదు.
సుకవి
జాషువా తెలుగు పద్యానికొక కొత్త వన్నెని తీసుకొచ్చాడు. వెన్నలాగే సాగే ఒక లాలిత్యం, ఒక నైగనిగ్యం, గంగా ప్రవాహంలాంటి నిర్మల ధార జాషువా పద్యం సాధించుకుంది. అవే ఆయన్ను తెలుగు ప్రజలకు ప్రీతిపాత్రుణ్ణి చేసాయి. బహుశా బమ్మెరపోతన తర్వాత, తిరుపతి వెంకట కవుల తర్వాత తెలుగు ప్రజల నాలుకల మీద నానగలిగే లక్షణాన్ని జాషువా పద్యమే చూపించగలిగిందని చెప్పవచ్చు.