బసవన్న కవిత్వంలోని శిల్పసౌందర్యం గురించి ఇక్కడ చాలా పైపైన, చాలా స్థూలంగా ప్రస్తావించాను. కాని పదేపదే మనల్ని వెన్నాడే ఆ కవితా వాక్యాలు మన మదిలో కలిగించే అలజడి గురించీ, నెమ్మదిగురించీ ఎంతో చెప్పుకోవాలి.
బసవన్న వచనాలు-11
సంప్రదాయం, మార్గ పద్ధతికి చెందినా, దేశిపద్ధతికి చెందినా, సంప్రదాయం సంప్రదాయమే. అందులో ఒక వ్యవస్థ ఉంటుంది. ఒక నిచ్చెనమెట్ల అమరిక ఉంటుంది. దానికొక పురాణకల్పన ఉంటుంది. వచనకవులు, అన్ని రకాల నిచ్చెనల్నీ పక్కకు నెట్టినవాళ్ళు, తమ సాహిత్యసృజనలో మాత్రం నిచ్చెనల్ని ఎట్లా అంగీకరిస్తారు?
బసవన్న వచనాలు-10
దైనందిన జీవితంలో హెచ్చుతగ్గుల్లేని సమాజం ఒనగూడాలంటే భాషలోనూ, జ్ఞానంలోనూ కూడా హెచ్చుతగ్గులుండకూడదని వచనకవులు మనసారా నమ్మారు. కాబట్టి వారు అప్పటికి ప్రచలితంగా ఉన్న ఒక్క ఛందోనియమాన్ని కూడా పాటించవలసిన పనిలేని ఒక నవ్యవాహికగా వచనాన్ని తీర్చిదిద్దుకున్నారు.
