ఒక స్త్రీ చదువుకుంటే ఒక కుటుంబానికి దారి దొరుకుతుంది అనేది పాతమాట. కాని ఆ చదువుకున్న స్త్రీకి హృదయసంస్కారం కూడా బలంగా ఉంటే మొత్తం ఒక తరానికే దారి దొరుకుతుందని ఇదుగో బాలగారి వంటి వారిని చూస్తే తప్పకుండా స్ఫురించే మాట. ఒక తరాన్ని తీర్చిదిద్దిన స్ఫూర్తి వారిది. ఈ కవితలూ, కథలూ ఆ స్ఫూర్తినే ప్రతిబింబిస్తుండడంలో, అందుకే, ఆశ్చర్యం లేదు.
నిజంగానే జగమంత కుటుంబం
తీరప్రాంతాలు, గ్రామాలు, నగరం, బొగ్గుగనులు, విదేశాలు నేపథ్యాలుగా ఉన్న కథలు మాత్రమే కాదు, ఇవి, వ్యక్తుల కథలు, కుటుంబాల కథలు, సమూహాల కథలు కూడా.
ఒక సూఫీ రామదాసు
తన గురువునుండి పొందిన ఆ ప్రేమని ఇప్పుడాయన తిరిగి మళ్ళా ధారాళంగా వెదజల్లుతున్నారు కాబట్టే వేలాదిమంది శిష్యులు ఆయన సన్నిధి నుంచి స్పూర్తి పొందుతున్నారు. విద్యావంతులైన నాగరికులు తమ శక్తియుక్తులన్నీ మనుషుల్ని మతాల పేరిట విడదీయడానికి చూస్తుంటే, ఇక్కడ, ఈ సూఫీ సంప్రదాయ రామదాసును ఆశ్రయించుకున్న గ్రామీణులు మతాలకు అతీతమైన ఒక ప్రేమసమాజంగా జీవిస్తున్నారు.
