అవి ఏమి కవితలు! అదంతా కొత్త తరం కవిత్వం. ఇప్పుడు ప్రపంచాన్నంతా వరదలాగా ముంచెత్తుతున్న Spoken Word Poetry ప్రక్రియకు చెందిన కవిత్వం తనదని చెప్పింది.
లేఖమాల
హరిహరప్రియ' గా ప్రసిద్ధుడైన సాతపల్లి వేంకట విశ్వనాథ భట్ట కన్నడ రచయిత, సుమారు 40 పుస్తకాలదాకా రాసాడు. కన్నడ రచయితలు కువెంపు, లంకేశ్ లకు సన్నిహితుడు. తెలుగు నుంచి విశ్వనాథ, నార్ల,సంజీవదేవ్ వంటి వారి రచనలను కన్నడంలోకి తీసుకువెళ్ళిన అనువాదకుడు.
అనంతపురం చరిత్ర
ఒకప్పుడు కల్నల్ కాలిన్ మెకంజీ సేకరించిన రచన అది. దాన్ని దాన్ని బ్రౌన్ ఇంగ్లీషులోకి అనువదించి 1853 లో ప్రచురించాడు. ఇన్నేళ్ళ తరువాత ఆ పుస్తకాన్ని గాయత్రి ప్రచురణలు, అనంతపురం వారు మళ్ళా వెలుగులోకి తీసుకువచ్చారు.
