తెలుగుసమాజం ఇప్పుడు అత్యంత ప్రాపంచిక సమాజం. మనుషులు వ్యక్తులుగానూ, సమాజంగానూ కూడా ఇంత వ్యాపారధోరణిలో కూరుకుపోయిన చోటు భారతదేశంలో నాకు మరెక్కడా కనిపించడంలేదు. ఈ కైదునుంచి తెలుగుజాతిని బయటపడేయాలంటే మహాయాత్రీకులు మరింతమంది పుట్టుకు రావలసి ఉంటుంది.
పేదవాళ్ళ ఆగ్రహం
చదవండి. ఈ పుస్తకం అవశ్యం చదవండి. కథావార్షికసంకలనాల సంకలనకర్తలూ, విశ్లేషకులూ ఆదమరిచి నిద్రపోతూ ఉండగా,ఈ కథాసంపుటి నిశ్శబ్దంగా రాత్రికి రాత్రి పుట్టుకొచ్చిన కొత్త నక్షత్రంలాగా మన సాహిత్యాకాశం మీద ప్రత్యక్షమయింది. పగటిపూట కూడా చుక్కలు చూపించే కథలివి.
పద్యవిద్య
కాని ఆ రోజుల్లో నేను నా గురువులనుంచీ, మిత్రులనుంచీ పొందిన స్ఫూర్తిని ఇప్పటి యువకవులకు కూడా పంచాలన్న ప్రలోభంతోనే కవిత్వశాలకోసం పనిచేయడానికి సిద్ధపడ్డాను.
