అసలు నిన్నటిదాకా ఎంతో ప్రేమాస్పదంగా, ఆరాధనీయంగా, సమ్మోహకరంగా కనిపించిన వ్యక్తి ఉన్నట్టుండి వికృతంగా ఎందుకు కనిపిస్తున్నాడో లేదా కనిపిస్తున్నదో మనకి అర్థం కాదు. మనం ఆ అనుబంధాన్ని కొనసాగించలేకా, వదులుకోలేకా పడే నరకయాతననుంచి మనల్ని మనమెలా బయటపడేసుకోవాలో కూడా తెలియదు.
మన పిల్లలకి మంచిది కాదు
ఎవరు చెప్తారు వీళ్ళకి? ఈ రాజకీయ శక్తులు మాట్లాడుతున్న హిందుత్వానికీ, అనాదికాలంగా ఈ దేశంలో కొనసాగుతున్న హిందూ జీవనవిధానానికీ సంబంధమే లేదని. అసలు 'హిందుత్వం' వేరు, హిందూ జీవన విధానం వేరని. అసలు హిందూ మతమంటూ ఒకటి లేనేలేదని.
గాంధీ కర్మజీవితం
అందులో మనకు బాగా తెలిసిన పార్శ్వాలు- బారిష్టరు, నేతపనివాడు, గ్రంథ రచయిత, పాత్రికేయుడు, ముద్రాపకుడు-ప్రచురణ కర్త వంటి వృత్తులతో పాటు మనకు అంతగా వివరాలు తెలియని కార్మిక జీవిత పార్శ్వాలు- బట్టలుకుట్టేవాడు, బట్టలు ఉతికేవాడు, క్షవరం చేసేవాడు, చెప్పులు కుట్టేవాడు, వంటవాడు, వైద్యుడు, నర్సు, రైతు వంటి వాటి చిత్రణ కూడా ఉంది.
