
నీ ఇంటికొచ్చినవారిచేతుల్లో
ఈ పూట ఒక పూలగుత్తి పెట్టు.
అవును, కాలానికి ఎదురేగినవారే
కాలానికి ఎదురీదినవారు.
అనుభవించడానికో
ఆస్వాదించడానికో అయితే
నాకు జీవితం పట్ల మోహం లేదు.
అయినా బతకాలనిపిస్తుంది-
మరింత తెలుసుకోడానికి
మరింత నేర్చుకోడానికి
మరింత పంచుకోడానికి.
ఇదొక మధువిద్య.
జీవించినంత కాలం
ఒక మధువిద్యార్థిగాజీవించాలి.
అలాగని
ఒక్కొక్క తేనెబొట్టూ తెచ్చుకుని
కట్టుకున్న గూటిలో
నేనుంటాననా?
ఆ మధుకోశం ఎవరి చేతికందినా
ఆ మధుసించితాధరాల మీద
నా తదుపరిజీవితం కొనసాగుతుంది.
Featured image coutesy: freestocks.org
31-12-2025


జీవితం పట్ల ఏ మొహం లేకుండా బతకాలనీపించటం…
బాగుంది సర్
శుభాకాంక్షలు
ధన్యవాదాలు సార్!
Beautiful philosophy of life 🌳
Thank you Sir 😊💐🙏🏼
మీకూ, మీ కుటుంబ సభ్యులకూ నూతన సంవత్సర శుభాకాంక్షలు💐
ఉదయాలనీ హృదయాలనీ వెలిగించిందీ కవిత!
*ఆ మధుకోశం ఎవరి చేతికందినా
ఆ మధుసించితాధరాల మీద
నా తదుపరిజీవితం కొనసాగుతుంది*
ఓ కవికీ కళాకారుణికీ మాత్రమే సాధ్యం కాగల చిరంజీవిత్వం ఇది! మీరు అలా కలకాలం ఉండిపోవాలని కోరుకుంటున్నాము సార్!
మీకూ, మీ కుటుంబ సభ్యులకూ నూతన సంవత్సర శుభాకాంక్షలు💐