పోస్టు చేసిన ఉత్తరాలు

ఒకప్పుడు కొన్ని వందల ఉత్తరాలు రాసేను మిత్రులకి. అవేవీ భద్రపరుచుకోలేకపోయాను. ఇప్పుడు ఉత్తరాలే కనుమరుగైపోయిన కాలంలోకి వచ్చాం. కాని ఉత్తరాల్ని ఒక వ్యక్తిగత అవసరంగానో లేదా ఒక సాహిత్యప్రక్రియగానో చూడలేం. అన్నిటికన్నా ముందు మనిషిని మనిషిగా తీర్చిదిద్దే శక్తి వాటికుందని నా స్వానుభవమే నాకు చెప్తున్నది. అందుకని మళ్ళా కొత్త తరహా ఉత్తరాలు రాయడం మొదలుపెట్టాను. ఇవి ఉత్తరాల గురించిన ఉత్తరాలు. రెండేళ్ళ కిందట అలాంటి ఉత్తరాలు పదిహేనుదాకా రాసాను. వాటినిప్పుడిలా గుదిగుచ్చి ‘పోస్టు చేసిన ఉత్తరాలు‘ గా ఇలా వెలువరిస్తున్నాను.

దీన్ని మొబైల్లో చదువుకోవాలనుకుంటే ఈ మొబైలు-ఫ్రెండ్లీ పిడిఎఫ్ డౌన్లోడు చేసుకోగలరు.

లేదా మామూలు పిడిఎఫ్ కావాలంటే ఇక్కడ డౌన్లోడు చేసుకోగలరు.

ఈ చిన్ని ఉత్తరాలగుత్తిని మానస, అనిల్, ప్రహ్లాదులకు కానుకగా అందిస్తున్నాను.

ఇది నా 69 వ పుస్తకం.

6-9-2025

4 Replies to “పోస్టు చేసిన ఉత్తరాలు”

  1. ఈ పున్నమికి పట్టపగలే ఇంత వెలుగా!!
    ఇలాంటి ఉత్తరాలు ఎవరు ఎదురుచూస్తుంటే వారికి అని రాసారు ముందుమాటలో. ఆ రకంగా ఇవన్నీ నిజంగానే నాకు. ఇవి రాస్తున్నప్పుడు రోజూ ఇంకో నిమిషం ముందే లేచి ఉత్తరం కోసం వెదుక్కోవడం గుర్తొచ్చింది.. ❤️❤️

    Thank you very very much for this beautiful gift, భద్రుడు గారూ. భద్రంగా దాచుకుంటాను.

  2. నచ్చిన మాటల్ని హైలెట్ చేసుకుంటూ చదువుతూ, చివరి పేజీకి అయ్యాక, మళ్లీ ఒక్కసారి తిప్పి చూస్తే, పేజీల రంగే మారిపోయింది సర్. ఒక అకాడమీ చేయాల్సిన పనిని ఒంటి చేత్తో పూర్తి చేశారని ఆరుద్ర గారి గురించి విన్నాం.. మిమ్మల్ని చూస్తున్నాం. వెబ్సైట్ నే గ్రంథాలయం గా మార్చి, ఇంత విలువైన జ్ఞాన సంపదను ఉచితంగా పంచుతున్నందుకు మరొక్కసారి ధన్యవాదాలు సర్.

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading