ఇప్పటికి తెలిసింది

ఇన్నాళ్ళూ ప్రతిరోజూ
దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాను
నిత్యం నా కష్టసుఖాలు
చెప్పుకుంటూ వచ్చాను.

ఇప్పటికి తెలిసింది.

నేను చేయవలసిందల్లా
ప్రతి ఒక్క పూటా
ఆయన ముందు మోకరిల్లి-

ధన్యవాదాలు ధన్యవాదాలు
ధన్యవాదాలు చెప్పుకోవడమే.

13-8-2025

14 Replies to “ఇప్పటికి తెలిసింది”

  1. Very true! ❤️ పండుగలు దేవుడి కథలను మళ్లీ గుర్తు చేసినట్టు..ఈ చిన్న కవిత దేవుడి దగ్గర ఏం చెయ్యాలో గుర్తు చేస్తోంది.. ❤️

  2. రోజూ జీవితాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్పుకోవాల్సిందే మరి. బాగా చెప్పారు సార్

  3. నిజ్జంగా నిజం…

    ఖచ్చితంగా చేయవలసిన పనిని ఎంత బాగా చెప్పారు సార్….

    నమస్సులు 🙏🙏❤️

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading