
పదేళ్ళ కిందట, ఒక మిత్రుడు వాళ్ళబ్బాయి పెళ్ళి సందర్భంగా, అతిథులకి ఇవ్వడానికి ఏదేనా పుస్తకం ఒకటి డిజైను చేసిమ్మని అడిగాడు. తనదగ్గర బాపు బొమ్మలు కొన్ని ఉన్నాయని కూడా చెప్పాడు. అప్పుడు ‘మనసున మనసై: భారతీయ కవులూ, వారి హృదయేశ్వరులూ’ అనే పుస్తకం రూపొందించాను. నా మిత్రుడు తనదగ్గరున్న బాపు బొమ్మల్ని ఆ కవితలకు తగ్గట్టుగా ఉపయోగించుకున్నాడు.
అయితే అది పెళ్ళికానుక కాబట్టి విస్తృతపాఠకలోకానికి అందుబాటులో లేకుండా ఉండిపోయింది. అదీ కాక, ఆ పుస్తకం ఎ-4 సైజులో ఉండటంతో అది పాఠకసన్నిహితం కాదు. అందుకని ఆ పుస్తకాన్ని ఇప్పుడిలాగ ఎ-5 సైజులో రీడిజైను చేసి మీతో పంచుకుంటున్నాను. మహత్తరమైన భారతీయ మీనియేచర్లనుండీ, భారతీయ శిల్పాల నుండీ, అజంతా చిత్రలేఖనాలనుండీ, అవనీంద్రుడు, రవీంద్రుడూ, అమృత షెర్-గిల్, అబ్దుర్ రహమాన్ చుగ్తాయి వంటివారి చిత్రలేఖనాల నుండీ ఎంపిక చేసిన బొమ్మల్ని ఆయా కవితలకు తగ్గట్టుగా పొందుపరిచాను.
ఇస్మాయిలు గారు ఉండి ఉంటే ఈ పుస్తకానికి ఆయనతో ఒక ముందుమాట రాయించుకుని ఉండేవాణ్ణి. ఇప్పుడు ఆ లోటు ఎవరు పూరించగలరా అని ఆలోచిస్తే మానస చామర్తి కనిపించారు. ఆమె ‘ప్రేమ మంత్ర మహోపాసన’ అని రాసిన సమీక్ష ఈ పుస్తకానికి తలమానికం.
ఈ పుస్తకాన్నిక్కడ డౌనులోడు చేసుకోవచ్చు. మీ మిత్రులకు కానుకగా పంపుకోవచ్చు.
9-7-2025


ధన్యవాదాలండీ. గత పదేళ్లగా.. మీ నుంచి ప్రతి రోజు ఒక కొత్తవిషయం నేర్చుకుంటూనే ఉన్నాను. మీకెలా కృతజ్ఞతలు తెలపాలా అని అనుకుంటా. గురుపూర్ణిమ సందర్భంగా మీకు హృదయపూర్వక నమస్సులు🙏🙏
హృదయపూర్వక నమస్కారములు. మీకు గురు పౌర్ణమి శుభాకాంక్షలు.
మీరే ఒక ప్రేమ సాగరం.
వేరెవరూ ఇవ్వనన్ని కానుకలు ఇస్తున్న మీకు అనేకానేక ధన్యవాద నమస్సులు 🙏❤️
హృదయపూర్వక ధన్యవాదాలు. శుభాకాంక్షలు.
గురుపౌర్ణమి సందర్భంగా మీకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. 🙏🌹
హృదయపూర్వక ధన్యవాదాలు. శుభాకాంక్షలు
మనసున మనసై పుస్తకానికీ స్వాగతం. ఒక అద్భుత పుస్తకాన్ని అందించారు. ధన్యవాదాలు సర్
హృదయపూర్వక ధన్యవాదాలు సార్