
ఇప్పటిదాకా వెలువరించిన కవితాసంపుటుల్లో కొండకింద పల్లె చివరిది, 2021 లో వచ్చింది. ఆ తర్వాత కడచిన నాలుగేళ్ళుగా ఎన్ని కవితలు రాసానా అని చూసుకుంటే, నలభై మూడు దాకా లెక్క తేలాయి. వీటితో పాటు, ఎప్పుడో, 1995 లో రాసి, ఇప్పటిదాకా ఏ సంపుటాల్లోనూ చోటు చేసుకోనివి మరొక రెండు కవితలున్నాయి (వాటిని నాకు తిరిగి చేర్చినందుకు గాలినాసరరెడ్డిగారికి ఎన్ని ధన్యవాదాలు చెప్పుకున్నా తక్కువే.) వాటితో పాటు మరొక ఐదు కవితలు కూడా ఏ సంపుటాల్లోను చేరనివి దొరికాయి
ఈ కవితల్లో ఒక వైవిధ్యం ఉంది, ఒక ఏకత్వం ఉంది. వైవిధ్యం ప్రక్రియా పరంగా. వచనకవిత, గీతం, గేయం, గజల్, ముత్యాలసరం, రెండుపంక్తుల, నాలుగు పంక్తుల కవితలు, ఐతిహాసిక దీర్ఘకవిత- ఇలా రకరకాల ఫణితుల్లో అభివ్యక్తిని పొదగడానికి చేసిన ప్రయోగాలు ఈ కవితలు. కాని సారాంశంలో మాత్రం, ఎప్పటిలానే వెలుతుర్ని పిండి వడగట్టే సాధన.
ఈ 50 కవితల్నీ ఇలా ‘కోమలనిషాదం, మరికొన్ని కవితలు’ పేరిట ఒక సంపుటంగా కూర్చి సంక్రాంతి కానుకగా మీతో పంచుకుంటున్నాను.
ఇది నా 54 వ పుస్తకం.
ఈ పూలగుత్తిని పెద్దలు నాగరాజు రామస్వామిగారికి కానుక చేస్తున్నాను.
12-1-2025


sankranthi subhakankshalu maastaaru…
మీకు మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు🙏💐
మేము ఎన్నో జన్మల నుండి పోగు చేసుకున్న తపోఫలం ఏమో గాని అన్ని బుుతువులలో పుష్పసించి / పరిమళించి / అమృత ఫలాలను అందించే మీలాంటి కల్ప వృక్షాన్ని పొందడం… 🙏
హృదయపూర్వక నమస్కారాలు.
వేయి వసంతాలు ఒకసారే ఎదురై కోటి కోయిలల గొంతుతో ఎలుగెత్తి పిలిచినట్టు ఉంది sir
ధన్యవాదాలు
Sir, just reminding…this link is not working. You need to update the ebook link . Kindly update at your convenience.
ఇప్పుడు సరి చేశాను. చూడగలరు. హెచ్చరించినందుకు అనేక ధన్యవాదాలు.