
పట్టపగలే ఆకాశానికి అడ్డంగా తెర వేసారు
ఇక రాత్రింబవళ్లు యక్షగానం నడుస్తుంది.
కావటానికి ప్రతి యేటా కొత్త జలతారుతెర,
అయినా అదేమిటో! అంతులేని కంతలు.
17-7-2024

chinaveerabhadrudu.in


పట్టపగలే ఆకాశానికి అడ్డంగా తెర వేసారు
ఇక రాత్రింబవళ్లు యక్షగానం నడుస్తుంది.
కావటానికి ప్రతి యేటా కొత్త జలతారుతెర,
అయినా అదేమిటో! అంతులేని కంతలు.
17-7-2024
భలే. మొత్తానికి కొత్త జలతారు తెర లో నుంచి యక్షగానం వినిపించే అదృష్టం కలుగజేసారు అందుకే కాబోలు ఈ ఉదయమే నేను గోపికృష్ణ నృత్యాన్ని చూసాను. ఒక అద్భుతం లో నుంచి మరొక యక్షగాన మహాద్బుతం లోకి వచ్చేసాను.
నాలుగు మాటల్లో సుదూర తరలింపు. ఇప్పుడు కళ్ళతో చూస్తూ చెవులతో వింటూ ఆకాశ విహారం.ఒక వైపు సుందరతరం, మరొక వైపు భీకరం. ఒకవైపు నీటిని నిలిపి ఉంచగల దట్టమైన మేఘం. మరొక వైపు శివతాండవం.
ఇలా ఎన్నని రాయను?
గొప్ప చిరునవ్వు ని ఇచ్చాటు. అలాగే ఇంత గొప్ప కవిని కనుగొన్న ఒక సామాన్యురాలు. ఒక సమీక్ష రాస్తే ఈ రోజోక్కటీ సరిపోదు.
సుమాంజలి.
ధన్యవాదాలు మేడం
Beautiful expression 🤍
Thank you Sir….