
రాలిన పూలు, రాలుతున్న పూలు, ఇంకా చెట్లని అంటిపెట్టుకున్న పూలు- మూడు రకాల పూలూ కూడా గాలితో ఆటలాడుకుంటున్న దృశ్యాన్ని వర్ణిస్తోనే కవి ఏకకాలంలో పారవశ్యాన్నీ, శోకాన్నీ కూడా పలవరించిన అరుదైన వర్ణన రామాయణంలో వసంత ఋతువర్ణన. రామాయణంలో కిష్కింధాకాండ మొదటిసర్గలో దాదాపు నూట అరవై శ్లోకాల్లో చిత్రించిన వసంతఋతు వర్ణనలోంచి కొన్ని శ్లోకాలూ, కొన్ని దృశ్యాలూ మీతో ఇలా ప్రసంగరూపంలో పంచుకుంటున్నాను.
27-4-2024


చాలా బావుంది sir
ధన్యవాదాలు గోపాల్!
చాలా బాగుంది సార్.
ధన్యవాదాలు కృష్ణ మోహన్!
నమస్సులు.మీ ప్రసంగం వింటూ …మీ స్వరం లో పలుకుబడి లో ఉండే ఒరవడి నన్ను తన్మయత్వానికి లోను చేసింది. కొన్ని స్వరాల్లోనే మనిషిని కట్టి పడేసే సంగీతధ్వని ఉంటుంది. హాయిగా పారే సెలయేరు కి ఒక లయ ఉన్నట్టు. అటువంటి కంఠ స్వరం మీకు లభించింది.వినే భాగ్యం శ్రోతలకి.
మీరు చెప్పిన విషయాల్ని ఒక్కసారి వింటే సరిపోదు.నిదానంగా..జాగ్రత్తగా వినాలి. సుమాంజలి
ధన్యవాదాలు మేడం
అత్భుతమైన మీ ప్రసంగం వింటూ అమిత ఆనందాన్ని పొందాను సార్. నమస్సులు.
ధన్యవాదాలు సార్
అద్భుతమైన ప్రసంగం.. వ్యాఖ్యానం భద్రుడు గారు. వాల్మీకి రేలచెట్టు పూలని పీతాంబరం తో పోల్చిన వైనాన్ని మీరు వివరించిన తీరు చాలా నచ్చింది. వసంత ఋతు వర్ణన శ్లోకాలు అన్నీ చదివి మరిన్ని విశేషాలు, విషయాలు తెలుసుకోవాలనే జిజ్ఞాస కలిగింది మీ ప్రసంగం విన్నాక.. ధన్యవాదాలు.
ధన్యవాదాలు సార్
మంచి ప్రసంగం. చూసింది చూస్తూనే వేరే అనుభవాన్ని(సీత)ఊహించడం, రాలిన, రాలుతోన్న, చెట్టు మీదనే ఉన్న పువ్వుల్ని గుర్తించడం, తాదాత్మ్యంతో ఇచటనే ఆగిపోనా అనిపించడం బాగా వివరించేరు
ధన్యవాదాలు సార్
I read that part in pullela gari rAmAyaNa tr. but your expose’ is superb. Thanks for sharing.
మీరు విన్నారంటేనే నాకు ఎంతో ఆనందంగా ఉంది. ధన్యవాదాలు సార్.