మనమెక్కడున్నాం?

మిస్సైళ్ళు, మంటలు, హాహాకారాలు, చరిత్ర
చెప్పే పాఠాలు తలకెక్కని యుద్ధోన్మాదం-
ఇప్పుడు మీదీ నాదీ కూడా లోపలా బయటా
మసిబారిన విషవాయువిధూత గగనతలం.

మీకులానే నేను కూడా ట్రంపు పక్కన లేను
తన మధ్యయుగాల సామ్రాజ్యాన్ని నిలుపుకోడానికి
స్వాతంత్య్ర పోరాటం చేసిన ఖొమేనీతోనూ లేను
ఉన్నాడో లేడో తెలియని నేతన్యాహూతో అసలేలేను.

మరెక్కడున్నాం మనం? టెహరానులో ఉన్నాం,
నిర్వాసిత లెబనానుతో పాటు టెల్ అవీవ్ లోనూ
ఉన్నాం, ఆ సాజిరీ తయ్యేబా ఎలిమెంటరీ స్కూల్లో
దగ్ధమైన గులాబీల్తో పాటు మనమూ మాడిపొయ్యాం.

.24-3-2026

7 Replies to “మనమెక్కడున్నాం?”

  1. ఇదొక పెను విషాద సమయం. హిట్లర్ అనేక రూపాల్లో వెలసినట్లున్నాడు మళ్ళీ.

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading