ఇంతకన్నా మరేం కావాలి?

(తెలుగు వెంకటేష్ కి, కర్నూల్లో ఒక ఫుట్ పాత్ మీద, సెకండ్ హాండు పుస్తకాల మధ్య, నా నీటిరంగుల చిత్రం కవిత్వం దొరికిందని విన్నప్పుడు)


ఇంతకన్నా మరేం కావాలి?
నాకు బతికుండగానే
అమరత్వం సిద్ధించింది.

6-1-2026

6 Replies to “ఇంతకన్నా మరేం కావాలి?”

  1. పుస్తకం తస్కరించిన వాడు / పోగొట్టుకున్న వాని పుస్తకం దొరికినవాడు దాని విలువ తెలియక జారవిడుచుకున్నా కాని వెదుకుతున్న/ చేరవలసిన అభిమానికి ఆత్మీయ సోదరుని కవిత్వం వరంగా దొరికింది అని సంబర పడుతున్నాను సోదరా!పుస్తకం గూడు చేరింది. పడవ తీరం చేరింది. తెల్లవారకముందే కోయిల కూసింది. నిన్న లేని అందమేదో నిదుర లేచేనెందుకో పూజా ఫలం సినీమా గుర్తుకు వచ్చింది.

  2. అలా అనవద్దు సార్ . గుండె చెరువై పోతుంది. మెత్తని మనసున్న తమరు ఇంకెన్ని చెప్పాలి. తరతరాలు ఒక అద్భుతమైన వ్యక్తి రాసిన అమృతాక్షరాలు చదివి పునీతులు కావాలి.

      1. మీ అక్షరాలు మాకు సంజీవి,
        మా హృదయాలలో మీరు చిరంజీవి!!

        జారవిడుచుకున్న వాడి మీద జాలి.. దక్కించుకోబోయే వాడి మీద అసూయ ద్వేషం కలుగుతున్నాయి..Sir 😎

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading