ఉత్తర ద్వారం

ఈ కాలమంతా
ఒక తలుపు తెరుచుకుంటూనే ఉంటుంది
అది కనబడేది కాదు
వినబడేది.

తల పైకెత్తి చూడు
ఆకాశమంతా
తలుపులు బార్లా తెరుచుకుంటున్న
నీలలోహిత ప్రకంపన.

ముంచెత్తే ఆ మందాకిని లో
మునిగి తేలకుండా
నువ్వు గుడికి వెళ్ళి ఏం లాభం?

తెరుచుకుంటున్న ఆ తలుపులు తీసి
నీలోకి నువ్వు అడుగుపెట్టావా
నీ ఇల్లే గుడిగా మారిపోతుంది.


Featured images courtesy: pexels.com

30-12-2025


18 Replies to “ఉత్తర ద్వారం”

  1. నీలోకి నువ్వు అడుగుపెట్టావా?
    సర్ నమస్సులు

  2. దేహమే దేవాలయం అనుభూతి తోపాటు, భగవంతుని అనుగ్రహం పొందడానికి చుట్టూ వున్న ప్రపంచాన్ని అర్థం చేసుకోవాలి అనే సందేశం!

    1. చిన్న కవిత, కానీ గొప్ప కవిత…
      నమస్కారం సార్ 🙏🌹

  3. ఉదయం లేవగానే మీ పద్యం చదివాను. ఆఫీసుకు వచ్చేముందు గుడికి వెళ్ళినప్పుడు ఈ పద్యం జ్ఞాపకం వచ్చింది. ఆదిశంకరుని మంత్ర సారం మొత్తం ఈ చిన్న పద్యంలో చెప్పారు

  4. అద్భుతం సర్. సరిగ్గా నా అభిప్రాయాన్నే కవితగా చెప్పేరు! 👏👏👏

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading