
కోకిల ప్రవేశించే కాలం (2009) నుంచి మరొక కవిత, నా ఇంగ్లిషు అనువాదంతో. ఇటువంటి కవితలు ప్రాచీన చీనాకవిత్వంలోనో, ఆంటోనియో మచాడోలోనో మాత్రమే కనిపిస్తాయి.
నారింజరంగు సంజకాంతి
నారింజరంగు సంజకాంతి
నీలాకాశంలో కలిసిపోయేవేళ
ఆకాశానికీ, భూమికీ మధ్య
గుప్పున ఊదారంగు పరిమళం.
పండుటాకుల వేపకొమ్మల మధ్య
ధూపం వేసినట్టు తొలివెన్నెల.
నగరం తనున్నచోటే మాయమై
మా ఊరు ప్రత్యక్షమైంది.
కొన్ని అనుభవాలకు మాటలుండవు.
రంగులు మటుకే.
The Orange Color of the Dusk
When the orange hue of dusk
Merges with the blue of the sky,
A burst of violet appears
Between heaven and earth.
Amidst the yellowed leaves of the neem tree,
The first moonlight burns like incense.
The city fades into the distance,
And my village emerges.
Certain moments cannot be expressed in words
But only in colors.
2025
Featured image: Photography by Raul Kozenevski via pexels.com
10-12-2025


నారింజ రంగు సంజకాంతిని ఉహించుకున్నాక ఈ సాయంత్రం టక్కున ప్రత్యక్షం అయింది. చూస్తూనే ఉండగా ఆకాశానికి, భూమికి మధ్య మాయం అయిపోయింది. నెమ్మదిగా చీకటి ప్రారంభం. నేనెక్కడ ఉండాల్సిన దాన్ని. ఇక్కడెక్కడో ఉన్నదాన్ని అక్కడెక్కడో ఉన్న మీ కవిత లో అక్షరమై చూస్తున్నాను. కొన్ని అనుభవాలకు మాటలు ఉండవు. రంగులే మహానుభావా!
నమస్సులు.
ధన్యవాదాలు మేడం.
అద్భుతం.. ఇంత మదురమైన కవితలను ఆస్వాదిస్తూ , మాకూ ఆ అనుభూతిని పంచుతున్న వీరభద్రుడు గారికి నా నమస్కారములు. .థాంక్యూ
హృదయపూర్వక ధన్యవాదాలు సార్!
పండుటాకుల వేపకొమ్మల మధ్య
ధూపం వేసినట్టు తొలి వెన్నెల వాక్యం అద్భుతం. జీవితమే చేదుతో నిండిన పండుటాకుల వేపకొమ్న తీసుకుంటే అద్భుతమైన ధ్వని .
నిజమే సార్ కొన్ని అనుభవాలు మాటలకు లొంగవు. రంగులు గా మిగిలిపోతాయి.🙏
హృదయపూర్వక ధన్యవాదాలు సార్!
Good evening sir, iam Srinidhi today your article is so nice and so beautiful sir
ధన్యవాదాలు మేడం!
ఓ చిన్ని కవితలో వర్ణానుభూతి ధూప పరిమళంలా చుట్టేసింది… 🧡💛💜
ధన్యవాదాలు ప్రసూనా!