
కోకిల ప్రవేశించే కాలం (2009) నుంచి మరో కవిత, నా ఇంగ్లిషు అనువాదంతో. ఇందులో చివరి వాక్యాలు శివలెంక రాజేశ్వరీ దేవికి చాలా యిష్టం.
సరోద్ వాదనం ఉదయ సూర్యరశ్మి
టేబుల్ పైన ఉదయ సూర్యరశ్మి
టేప్ నుండి వినవస్తున్నదొక సరోద్ వాదనం.
అరవిందాలు పూసిన కొలను
మందారాలు విరిసిన తోట
ప్రభాతం ఒక స్వర్ణహంస
రాగం ప్రత్యూషపవనం.
అలజడి శమించినవేళ
శాంతసరోవరం నా చుట్టూ
నా చిన్నిరెక్కల పైన అద్దాలు
గది అంతా ఒక పరాగ సౌఖ్యం.
తాపంలేదు, పశ్చాత్తాపం లేదు
ఆ అంగుళులు మొదటమీటినప్పుడు
అనాహతనాదం ఎక్కడ మేల్కొందో
అదే పునఃపునః జాగృతమౌతోంది.
ఎక్కడికి పయనించానో తెలీదు
హృదయం ఒక నావ అయింది.
ఎవరిని కలిసానో తెలీదు
ఒక సమాగమం పూర్తి అయింది.
Sarod and Sunshine
Morning sunlight on the table,
A sarod playing from the stereo.
A pond where lotuses unfold,
A park where hibiscus shine.
The dawn is a golden swan;
The raga, the morning breeze.
A serene lake spreads around me-
As all agitations stilled.
Glowing mirrors on my tiny wings;
The room brimming with pollen’s joy.
No anguish, no regret.
When those fingers first tuned,
The unstruck music commenced,
Resonates again and again.
I’m not sure where I have roamed,
My heart became a boat.
I don’t know whom I met,
Yet the meeting complete.
2025
Featured image: Photography by Chandre D’Oliveira via pexels.com
1-12-2025


మీరు ఒంటరి నావికుడు అని …మహా సముద్రంలో ఒక చిన్న తెప్ప లో బయలుదేరిన అత్యాశ్చర్యకరం అని ఒక మహానుభావుడు రాస్తే అది పత్రికలో పడడం…మేము రాసిన వారి ఇంటికి ఒక్క పరుగున పోవడం… వారు తన చివరి రోజుల్లో మీ గురించి చెప్పడం …అదేమన్నా చిన్న విషయమా భద్రుడు గారూ…ఒక అపారమైన మేధా సంపత్తి, అణుకువ, మనుషుల పట్ల దయార్ద్రహృదయం ఉన్న ఒక ఎన్నదగిన వ్యక్తి తమరి గురించిన రాసిన కవితా పుష్పం మామూలుదా?
అలాగే నిలబడి రాలేక రాలేక వచ్చిన రోజది.
వారు పరమపదిస్తారని తెలిసి… ఉండలేక, వెళ్ళలేక నేను పడిన అవస్థ వర్ణనాతీతం. ఆ సమయం లో మీ గురించి చెప్పడం మామూలు విషయమా?
నమోనమః నావికా.
హృదయపూర్వక నమస్కారములు
Wonderful poem
ధన్యవాదాలు సార్