
సాహిత్యం మీద మాత్రమే కాకుండా చరిత్ర, సమాజం, సంస్కృతికి సంబంధించిన అంశాల మీద నేను పాతికేళ్ళుగా రాస్తూ ఉన్నాను. అటువంటి వ్యాసాలతో గతంలో ‘సోమయ్యకు నచ్చిన వ్యాసాలు‘ (2012) పేరిట ఒక సంపుటం కూడా వెలువరించాను. అదే క్రమంలో రాస్తూ వచ్చిన మరొక 36 వ్యాసాల్ని ఇలా ‘ఉదారచరితులు‘ పేరిట మీకు అందిస్తున్నాను.
ఇంతవరకూ అందిస్తున్న పి.డి.ఎఫ్ లు మొబైల్లో చదువుకోడానికి అనుకూలంగా లేవని మిత్రులు అంటున్నందువల్ల మొదటిసారిగా, ఈ పుస్తకాన్ని మొబైలు-ఫ్రైండ్లీ పి.డి.ఎఫ్ గా డిజైను చేయగలిగాను. దీన్ని మీరిక్కణ్ణుంచి డౌనులోడు చేసుకుని మీ మొబైల్లో సౌకర్యంగా చదువుకోవచ్చు.
అలాకాక సాధారణ పి.డి.ఎఫ్ ఫార్మాటులోనే డౌనులోడు చేసుకోవాలనుకున్నవారు ఇక్కణ్ణుంచి డౌనులోడు చేసుకోవచ్చు.
ఈ పుస్తకాన్ని నా చిరకాలమిత్రులు, ఆత్మీయులు కల్లూరి భాస్కరంగారికి కానుక చేస్తున్నాను.
ఇది నా 68 వ పుస్తకం.
21-8-2025


తెలుగు సమాజాలకు రేపటి తరాలకు మరొక అద్భుతమైన కానుక మీ నుండి అందింది సార్ హృదయపూర్వక ధన్యవాదాలు సార్ శుభాకాంక్షలు నమస్తే సార్
హృదయపూర్వక ధన్యవాదాలు బాలాజీ గారూ!
Thank you very much sir for one more wonderful Book
హృదయపూర్వక ధన్యవాదాలు సార్!
పేరేమో వామనుడు నిజంగా త్రివిక్రముడు. పేరు బాలమురళి లేదా బాలు కానీ సంగీతంలో విరాట స్వరూపులు. అలాగే పేరు చినవీరభద్రుడు కానీ పెద్ద హృదయం కల ఉదారుడు. ఎవరండీ ఇలా జ్ఞాననిధిని పంచిపెట్టేది. మీరు రాశిలోనూ, వాశిలోనూ బోలెడు రాసారు. అన్నీ చదవాలి. మీరు రాసినవి చదవాలి, మీరు చదివినవీ చదవాలి. గడియారం చిన్న ముల్లు టక్ కట్ అంటోంది. మీ సహృదయతకి, ఉదారతకి ఎన్ని జన్మలైనా ఋణ పడి ఉంటాను.
హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు సార్!
💯truth👍🏾🙏🏾