
పుస్తక పరిచయం ప్రసంగాల్లో భాగంగా గత రెండువారాలుగా అజంతా ‘స్వప్నలిపి’ (1993) పైన ప్రసంగిస్తూ ఉన్నాను. ఇది మూడవ ప్రసంగం. చివరి ప్రసంగం. మొదటి రెండు ప్రసంగాల్లోనూ అజంతా లోనైన భీతి గురించి వివరించేను. ఆయన భీతి ఒక వ్యక్తిగత అనుభవం కాదనీ, అదొక సామాజిక అనుభవమనీ దానికి ఆయన అభివ్యక్తినిచ్చాడనీ చెప్పాను. నిష్ఠురమైన ఈ వాస్తవాల్ని ప్రకటించడంలో ఆయనకీ పాతనిబంధన ప్రవక్తలకీ, ముఖ్యంగా జెరిమియాకి ఉన్న పోలికల్ని కూడా వివరించేను. 48-92 దాకా ఆయన లోనవుతూ వస్తున్న భీతిని 90 ల్లో ఎలా జయించాడో, చివరికి ఆధునికానంతర యుగ ప్రవక్తగా ఎలా మారేడో ఈ ప్రసంగంలో వివరించాను. ఈ ప్రయాణంలో కీలకమైన మూడు కవితలు,’స్వప్నలిపి’ (1992), ‘వేళ్ళు ఇక్కడే’ (1992), ‘మృత్యువు హాస్యప్రియత్వం’ (1997) ల గురించి వివరంగా మాట్లాడాను.
ఈ ప్రసంగం వినడానికి ఈ లంకె నొక్కండి.
Featured image: Gond art (PC: https://www.cottage9.com/blog/gond-painting-exploring-the-art-and-tradition/)
30-5-2025


Thank you so much sir..
❤️
ధన్యవాదాలు మానసా!