అవధూత గీత

కిందటి అక్టోబరు-నవంబరు నెలల్లో అవధూత గీతకు నా తెలుగు అనువాదాన్నీ, ఆ గీతను ఉపదేశించిన దత్తాత్రేయుల దర్శనం పైన కొన్ని ఆలోచనల్నీ మీతో పంచుకున్నాను. ఇప్పుడు ఆ అనువాదాన్ని ఈ మహాశివరాత్రి పర్వదినం నాడు ఇలా పుస్తక రూపంలో మీతో పంచుకుంటున్నాను.

ఇది నా 57 వ పుస్తకం.

ఈ అనువాదం రావడానికి కారణమవడమే కాకుండా, ప్రతి ఒక్క శ్లోకానువాదాన్నీ తన మనసుతో చదివి, నాతో చర్చించి తనకి ఆ అనువాదం స్పష్టమయ్యేదాకా నాతో సవరిస్తూనే వచ్చినందుకు మిత్రుడు గంగారెడ్డికి ఎన్ని ధన్యవాదాలు చెప్పినా తక్కువే.

నేను సంస్కృత పండితుణ్ణి కాను. కాబట్టి ఈ శ్లోకానువాదాల్లోని భాషాదోషాల్ని, అన్వయ దోషాల్ని సరిచూడవలసిందిగా మిత్రులు శ్రీ ఉరుపుటూరి శ్రీనివాసును అభ్యర్థించాను. ఈ రోజుల్లో ఒక పుస్తకం చదవడానికే సమయం ఇవ్వలేని పాఠకులున్న కాలంలో ఆయన నా మొత్తం అనువాదాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఎన్నో సూక్ష్మాంశాల్ని ఎత్తిచూపి నేను సవరించుకునేలా చేసారు. అందుకని ఈ అనువాదానికి ఆయన్ని పరిష్కర్త అని చెప్పవచ్చు. ఆయన చూపించిన ఈ ఔదార్యానికి బదులు తీర్చలేనంతగా ఋణపడ్డాను. వారికి హృదయపూర్వకంగా నమస్కరించడమే నేను చెయ్యగలిగింది.

ఈ అనువాదాన్ని గాణ్గాపురంలోని శ్రీ నృసింహ సరస్వతీ స్వామివారి నిర్గుణపాదుకలముందు సమర్పిస్తున్నాను.

26-2-2025

5 Replies to “అవధూత గీత”

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading