ఈశ్వర స్తుతిగీతాలు

బైబిల్లో పాతనిబంధనలో కీర్తనల అధ్యాయంలో ఉన్న నూటయాభై కీర్తనల నుంచి కొన్ని కీర్తనల్ని జయగీతాలు పేరిట కిందటేడాది జనవరిలో తెలుగుచేసి ఎప్పటికప్పుడు మీతో పంచుకున్నాను. ఆ గీతాలకు మరికొన్ని గీతాల అనువాదాలు కలిపి ఈ మధ్య మళ్ళా మీతో పంచుకున్నాను. మొత్తం అరవై నాలుగు గీతాలకు తెలుగు అనువాదాల్నీ, విపులమైన ఒక పరిచయ వ్యాసంతో కలిపి ఇప్పుడు ఈశ్వర స్తుతిగీతాలు పేరిట ఇదుగో ఇలా మీకు అందిస్తున్నాను.

ఇది నా 48 వ పుస్తకం.

ఈ పిడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోడానికి ఈ లింకు చూడండి. డౌన్ లోడ్ చేసుకున్నాక ఈ సాఫ్ట్ కాపీని మీ మిత్రులతో కూడా పంచుకోగలరు.

మా శరభవరం పంచాయితీ ఎలిమెంటరీ స్కూల్లో నా పసితనాన నాకు చదువు చెప్పిన వజ్రమ్మ పంతులమ్మగారు క్రైస్తవురాలు. కాని ఆ పసితనాన ఆమె నాకు మతాలకు అతీతమైన సర్వేశ్వరుణ్ణి పరిచయం చేసి ఉండకపోతే నేనిట్లా నిలబడగలిగి ఉండేవాణ్ణి కాను. అందుకని ఆమె స్మృతికి ఈ గీతాంజలి సమర్పిస్తున్నాను.

18-10-2024

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading