
Strange nightingale whose mouth is open wide
To fit both thorns and roses now inside!
Rumi (Masnavi, 1:1582)
నోరారా ఎలుగెత్తి పిలుస్తున్నప్పుడే
అనుకున్నాను
ఆ కోకిల తన గొంతులో
పూలూ, ముళ్ళూ
రెండూ పొదువుకుందని.
పూలు సరే,
రంపం పళ్లలాంటి
ముళ్ళెందుకని
ఆ గొంతులో?
కొడవలి కక్కుల్లాంటి
ఆ కూజితాలు వినగా వినగా
మిత్రలాభకథ
కొత్తగా వినిపిస్తున్నది.
నేనిరుక్కున్న వలతాళ్ళు
ఈ చిత్రగ్రీవం
తనే కొరికి తెంపుతున్నది.
Featured image: commons.wikimedia.org
16-7-2024


Very nice
ధన్యవాదాలు
టక్కున గుర్తుకు వచ్చింది ఒక సందర్భం.
మీ సునిశిత, సున్నితమైన కవిత అంతరార్థం కొంత ఆలస్యంగా…అర్థం అవుతున్నట్టు ఉంటుంది . మరి కొంత వివేచన ఉంటేనే ఆ మాటల్లో , పదాల్లో వ్యక్తీకరణ భోధపడుతుంది. అంత హృద్యం.
కాకపోతే వేర్వేరు అనుభవాల్లో చెప్పబడుతుంది.
నాకు నా అనుభవం లో గుర్తొచ్చిన చిన్న కవిత తమరు వినాలని నా ఆశ. ఎందుకంటే మర్మం మీకు అవగతాయినట్టు మరొకరికి అర్థం అవుతుందని నేను అనుకోలేక.
చీకటి తరువాత….
నా స్నేహితురాలి అనుంగు చెలికత్తె
తన రాణి మెప్పు పొందడం కోసం
నన్ను దోషిని చేసినప్పుడు…
నా వైపు చూసిన చూపు
మార్గశిరమాసపు చిక్కని చీకటి లో
ఆరుబయట నిలదీసినట్టయింది…
గోడలకి చెవులు
నమ్మలేని నిజాలు
కళ్లతో చూస్తున్నాభ్రమ పెట్టే ఇజాలు
ఉత్తుత్తినే అనుకునేవి కావన్నమాట!
తల నిండా ఉప్పొంగుతున్నగోదారి…
నిలువనియ్యని ఆలోచనల దాడి..
నిదురే రాని నిశి రాత్రి లో నాకున్న తోడొక్కటే….
నాలోని నాతోనే ఉండే హృదయ దీపపు వెలుగు…
నెమ్మదిగా పరుచుకుంటూ… నన్ను చుట్టేసుకుంటూ…….!
నమోనమః
ధన్యవాదాలు మేడం
చదవగానే కనుల ముందు పరుచుకునే imagery ని దాటుకుని ఈ కవిత చూపిన దారుల వెంట వెళ్ళగా వెళ్ళగా నాకగుపించిన emotion పరిచితంగా తోచింది సర్.
Fortunately నేనిరుక్కున్న వల తాళ్ళను కొరికి తెంపే చిత్రగ్రీవాలను నేను కలిశాను.
ధన్యవాదాలు మాధవీ!