రాజమండ్రి డైరీ

నలభయ్యేళ్ళ కింద రాజమండ్రిలో ఉన్నప్పుడు రాసుకున్న డైరీలో కొన్ని పేజీలు గతంలో ఇక్కడ మీతో పంచుకున్నాను. వాటిని ఒక పుస్తక రూపంలోకి తెచ్చి చాలారోజులే అయ్యింది. కిందటేడాది డిసెంబరులో సాహితీ వేదిక మిత్రులు రాజమండ్రిలో కలుసుకున్నప్పుడు ఆ పుస్తకం ఆవిష్కరిద్దాం అనుకున్నాను. కాని వీలు పడలేదు. అప్పణ్ణుంచీ కనీసం ఆన్ లైన్ ప్రతినైనా విడుదల చేద్దాం అనుకుంటూనే ఉన్నానుగాని, అది కూడా వీలవలేదు. ఎలాగైతేనేం ఈ రోజు ఈ పుస్తకం మీతో పంచుకుంటున్నాను.

ఈ ఉత్తరాలు ఇక్కడ నా బ్లాగులో పంచుకున్నాక ప్రసిద్ధ కవయిత్రి, భావుకురాలు మానస చామర్తి ఆ ఉత్తరాల పైన ఒక చిన్ని సమీక్ష తన వాల్ మీద పోస్టు చేసారు. ఆ సమీక్షని మరికొంత విస్తరించి ఈ పుస్తకానికి ముందుమాటగా రాసిచ్చారు. ఆమెకి నా హృదయపూర్వక ధన్యవాదాలు.

ఈ చిన్ని పుస్తకాన్ని నా రాజమండ్రి మిత్రుడు సమాచారం సుబ్రహ్మణ్యానికి అంకితమిచ్చాను. ఆయన మీద ఒక వ్యాసం కూడా ఈ పుస్తకంలో చేర్చాను.

ఇది నా 46 వ పుస్తకం. దీంతో, ఉత్తరాలు, నాటకం, సంగీతరూపకం తప్ప, తక్కిన అన్ని సాహిత్యప్రక్రియల్లోనూ నా రచనలు వెలువడినట్టే.

మీరు ఈ రచనను ఆదరిస్తారని ఆశిస్తున్నాను.

14-7-2024

21 Replies to “రాజమండ్రి డైరీ”

  1. చాలా చాలా సంతోషం సర్. ఈ పుస్తకం చదివి మీరూ జీవితంతో కొంత యుద్ధం చేశారన్న ఊహకే బలం తెచ్చుకున్న మిత్రులు కనీసం ఇద్దరు తెల్సు నాకు. తెలియక ఇంకెందరో. Thank you very much for writing this.
    నాకూ భాగం ఇచ్చినందుకు ఇంకా, ఇంకా. ❤️❤️

  2. రాజమండ్రి అంటే నే ఓ వైబ్రేషన్, అలాంటి మీ అక్షరాలలో గోదావరి తరంగాలను చూస్తూ , వింటూ ఓ ఆనంద పారవశ్యం అనుభవిస్తూ, అనుభూతి పొందుతూ.. అది అనంతం

  3. అభినందనలండీ. తప్పకుండా చదువుతాను.
    లింక్ ఇచ్చినందుకు ధన్యవాదాలు🙏

  4. మీ తొలి జీవితంలో రాజమండ్రి ఎంత ప్రభావాన్ని చూపిందో… మీ రచనల్లో చదివాను. రాజమండ్రి, గోదావరి, చినవీర… ఆంధ్రులకు ప్రత్యేకం, సతత హరితం 💚

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading