
ఇంకా తెల్లవారకుండానే
కొలిమి రగిలిస్తుంది కోకిల
తన గొంతు ఒక తిత్తిగా ఆ
ఊదడానికి అంతే ఉండదు.
కమ్మరి వీరాసామి కొలిమి దగ్గర
రైతులు చేరుకున్నాక, గుర్తుందా!
చాలాసేపటిదాకా ఒక వైపు పని
మరోవైపు పిచ్చాపాటీ.
అప్పటికి మంట చల్లారుతుంది
అంతసేపూ ఊదినందుకు
ఎటుచూడు నింగినిండా
బూడిదరంగు మబ్బులు.
11-7-2024


బూడిద రంగు మబ్బులు…! ఆహా! ఆ కోకిల మీద నాకు ప్రేమ అసూయ కూడా.. ఇంకా దాని మీద కవిత్వం రాసేందుకు మిమ్మల్ని ప్రేరేపించగల్గుతున్నందుకు, అందుకే ప్రేమ. అందుకే అసూయ.
“కోకిల ప్రియ” గారూ ❤️❤️ Yet another beautiful poem!
ధన్యవాదాలు మానసా!
భలే.
Beautiful
ఊపిరి తిత్తి కొలిమితిత్తిగా
కొలిమికాడ బూడిద ధూళి
నింగిలో బూడిద మబ్బు
ఇక్కడ పిచ్చాపాటీ
అక్కడ గొంతు విచ్చిన పాట
ఇక్కడ వీరాస్వామి
పక్కనే వీరభద్రుడు
ఆహా ! ఆషాఢం ఆర్ద్ర కవిత్వమై
ఎంత అందంగా అలరించింది
ధన్యవాదాలు సార్