
ఆషాఢ ప్రథమదివసం నాడు
ఒక నది ఒడ్డున నిల్చున్నాను
ప్రతి ఏడూ ఈ మొదటిరోజున
నాకోసం ఒక ఉత్తరమొస్తుంది.
రేవునిండా కిక్కిరిసిన జన
సందోహం. ఒక్కళ్లకీ తెలీదు,
ఇప్పుడిక్కడ మేఘమొక
వుత్తరం జారవిడుస్తుందని.
చూస్తూండగానే ఎక్కడికక్కడ
నింగినిండా పైకెత్తిపట్టుకున్న
లాంతర్లు. అర్థమయింది, ఆ
ఉత్తరం కింద చదువుకునేది కాదు.
7-7-2024


Wah! Wah!!!
ఆ పెయింటింగ్….ఆ మబ్బు తునక…ఆ చీర కట్టుకున్నావిడ…బ్యూటిఫుల్!!❤️❤️
ధన్యవాదాలు మానసా!
ఆహా…
ధన్యవాదాలు మేడం
Beautiful!! ❤️
Thank you Madhavi!
చిత్రమూ ఉత్తరమూ ఒకదానికొకటి పోటాపోటీగా
ధన్యవాదాలు సార్
సొగసు చూడ తరమా..
అని పాడాలనిఉంది
ఎర్రచీర అమ్మాయి posture భలే ఉంది
ధన్యవాదాలు సార్!
మరి ‘ప్రత్యుత్తర’మేది?
నీవంటి సహృదయులు చదవటమే ప్రత్యుత్తరం.
ఆ ఉత్తరానికి మీ ప్రత్యుత్తరం కూడా ఒక చిత్రమైతే ఎంత సమ్మోహనమో
ధన్యవాదాలు
Very nice 🌧️🤍 Sir
Thank you Prasuna!
మబ్బులు మబ్బులు మబ్బులొచ్చినై.. so beautiful