అంతటా నిండుగా విరబూసిన ఈ కర్ణికారవృక్షాల్ని చూస్తుంటే పచ్చటి ఉడుపులు కట్టుకుని పసిడినగలు తొడుక్కున్నట్టుంది
మట్టిమనిషి
ఆ నాటకం చూస్తున్నంతసేపూ, ఆ కథాంశానికి కాలం చెల్లలేదనీ, ఇప్పుడు మన సమాజంలో మట్టిమనిషి వెర్షన్ 2.0 నడుస్తోదనీ నాకు పదే పదే అనిపించింది. ఇప్పుడు సాగుభూమిని సినిమహాలుగా మార్చి పెట్టుబడిని రెండింతలు, మూడింతలు చేసుకోడం మీద కాదు, ఆ భూమిని ఒక రియల్ ఎస్టేట్ పాచికగా మార్చి పెట్టిన పెట్టుబడిని రాత్రికి రాత్రే పదింతలు చేసుకోవాలనే రాక్షసదురాశ ఆవహించిన కాలంలో ఉన్నాం.
సాహిత్యం గొప్ప ఆశ్రయం
కాని ఏళ్ళ మీదట, సోక్రటీస్ నీ, ప్లేటోనీ చదివాక, శ్రోతల్ని రంజింపచెయ్యడంకన్నా, శ్రోతలు మెచ్చకపోయినా సత్యం మాట్లాడటమే నిజమైన వక్తకి ముఖ్యం కావాలని తెలుసుకున్నాను.
