
చెట్లు చిగిరించే
కాలంలాగా
ఈ నగరంలోకి
గాలిపటాల
ఋతువొచ్చింది.
పల్లెల్లో బంతిపూలు,
దారి పక్క గొబ్బిపూలు
ఇళ్ళ కప్పుల మీద
పండుగుమ్మడిపూలు
పూసినట్టు
ఈ సాయంకాలం
నగరాకాశం మీద
గాలిపటాలు
విరబూసాయి.
ఎక్కడికక్కడ
ఫౌంటెన్లు తిప్పినట్టు
పసుపు, గులాబి, ఊదా
రంగుల తునకలు.
ఎగురుతున్న గాలిపటాల
దారాలకు తగులుకుని
భవనాలు కూడా
గాల్లోకి లేచిపోతున్నాయి.
ఇలాంటి మాజిక్ షో
నేనిప్పటిదాకా చూడలేదు.
ఇప్పటిదాకా ఉండలాగా
నన్ను చుట్టుకున్నదేదో
వదులవుతూ
నేను కూడా
తేలిపోడం మొదలుపెట్టాను
14-1-2024


Lovely and lovely title! ❤️
ధన్యవాదాలు మానసా!
మీరు తెంపుకొని ఎగిరి పోవాలని చుస్తే.. తెగిన గాలిపటం కోసం పరుగెత్తే పిల్లల్లా మేము మీ వెంటే.. గజేంద్ర మోక్షం లో విష్ణుమూర్తి ని అనుసరించిన శంఖు చక్రలా 🙏
సంతోషం
Painting and poem, both are beautiful. Sir.
Thank you Madhavi!
మీరు మాత్రమే కాదు.. అందరం గాలి పటాల తో మీరు చిత్రించిన పటాలతో గాలి లో తేలి తేలి పోతున్నాం.🙏
Thank you Sir!
దారాలతోపాటు భవనాలు గాల్లోకి తేలినట్లు చాలా బావుంది. పైన చిత్రం. కవిత నేపథ్యం లో సాగి పాట బాగున్నాయి.
ధన్యవాదాలు సార్
మనసుకు హత్తుకుంది.
ధన్యవాదాలు