ఈ సారి ఆ క్షేత్రాలకు వెళ్ళినప్పుడు ఆ కావ్యాల్లోని ఆ పద్యాల్ని అక్కడ బిగ్గరగా నాకై నేను చదువుకోవాలనుకుంటున్నాను. నదీతీరాల్లో మనం మన పూర్వీకులకు తర్పణలు ఘటించినట్టుగా, ఆ మహాశిల్పసముదాయాల ఎదట ఈ పూర్వమహాకవులకు వినయాంజలి సమర్పించాలనుకుంటున్నాను.
ఒక మాట
చివరికి ఇన్నాళ్ళకి, అంటే ఈ రచన మొదలుపెట్టిన 36 ఏళ్ళ తరువాత, ఇలా పూర్తిచేయగలిగాను. నా జీవితంలో సుదీర్ఘకాలం తీసుకున్న రచనగా ఇది మిగిలిపోతుంది.
ఆ వెన్నెల రాత్రులు-30
అన్నిటికన్నా ముందు యువతీయువకుల తొలియవ్వనకాలంలో అటువంటి మనఃస్థితి ఉంటుందని గుర్తుపట్టడం ఒక విద్య. ప్రేమ విద్య. కాని మహాకవి చెప్పినట్లుగా ఆ విద్య ఇంట్లో తల్లిదండ్రులు చెప్పరు, బళ్ళో ఉపాధ్యాయులు చెప్పరు, దానికి పాఠ్యపుస్తకాలూ, సిలబస్, కరికులం ఎలా ఉంటాయో తెలియదు. ప్రేమ అంటే యాసిడ్ దాడిగానే పరిణమించే కళాశాలలు మనవి. ఇంక ప్రేమ అంటే ఏమిటో చెప్పేవాళ్ళెవరు? కవులూ, రచయితలూనా? ప్రేమ వల్ల కాక, ప్రేమరాహిత్యం వల్లనే మనుషులు కవులుగా మారే సమాజం మనది.
