ఒక శిల్పం చూడండి. అది మనతో మాట్లాడుతుంది, కాని భాషతో పనిలేదు దానికి. తన పాదార్థిక అస్తిత్వం వల్లనే అది శిల్పంగా నిలబడుతున్నది కానీ, ఆ పదార్థం ఒక వాహకం మాత్రమే. మనతో మాట్లాడేది ఆ పదార్థం కాదు. అలా ఒక శిల్పంలాగా మనతో మాట్లాడగల కవితని ఊహించండి. అటువంటి కవిత్వం తెలుగులో దాదాపుగా అరుదు.
రమణీ ప్రియదూతిక
సిమెంటుకాంక్రీటు నగరం మీద సుత్తితో మోదుతున్నది కోకిల. నగరాన్ని నిరుపహతి స్థలంగా మార్చడానికి నాకు తెలిసి మరో దారి లేదు.
పూలప్రళయం
మిట్టమధ్యాహ్నం దారిపొడుగునా పెద్ద వరద. కొన్ని వేల దీపాల్ని ఒక్కసారి వెలిగించినట్టు ఎటు చూడు తురాయిచెట్లు.
