సురభిళించే చామతులు, పొలాల్లో విరగబూసే బంతిపూలు, పండిన పంటని ఇంటికి తీసుకొచ్చే రెండెడ్లబళ్ళు, ముగ్గులు, గొబ్బిళ్ళు, మంచుతెరల్లో కునికే పల్లెలు- ఈ లోకం గురించి ప్రతిసారీ ఏదో మాట్లాడాలని అనిపిస్తుంది.
అక్షరయాత్ర
ఆమె నన్ను ఇంటర్వ్యూ చేస్తానని వచ్చారుగాని, అక్కడ కెమేరా ఉందన్న విషయం ఇద్దరం మర్చిపోయి, హాయిగా, మాట్లాడుకున్నాం. రెండు గంటల పైనే. చాలా విషయాలు, సాహిత్యం, విద్య, భాష-ఎన్నో అంశాలు.
మధురవిషాద మోహగాథ
నా దృష్టిలో విక్రమోర్వశీయం కావ్యం. అందమైన, సుకుమారమైన దీర్ఘకవిత. చింగిజ్ ఐత్ మాతొవ్ రాసిన జమీల్యా లాగా అది విషాదమాధుర్యాలు కలగలిసి, చివరికి, మాధుర్యమే మనల్ని వెన్నాడే ఒక మోహగాథ.
