. కాని ఆయన తన కొలీగ్స్, తన పై అధికారులు, చివరికి మంత్రులూ, ఎమ్మెల్యేలూ కూడా తన సాహిత్యాన్నీ, పద్యాల్నీ, అవధానాల్నీ చూసి విని ఆనందించాలని కోరుకునేవాడు. వాన పడ్డప్పుడు రాళ్ళమీదా, ముళ్ళమీదా కూడా కురిసినట్టే, ఆయన సాహిత్యవర్షం హెచ్చుతగ్గులు చూసేది కాదు.
ఎడిటింగ్ గురించి
డిజిటల్ ఎడిటింగ్ లోని సాంకేతిక సామర్థ్యాన్ని, అవకాశాల్ని ఎంతో సవివరంగా మనముందుంచిన రచయిత, కేవలం సాంకేతిక సామర్థ్యమే ఉత్తమ కళాకృతుల్ని తీసుకురాగలదన్న హామీ లేదని కూడా చెప్తాడు.
ఆయన వెంట నడుస్తూనే ఉన్నాను
దురదృష్టవశాత్తూ మనం సాధన చేస్తున్నది రాజీపడకుండా మన అభిప్రాయాల్ని నిలబెట్టుకోవడమెలా అన్నది. కాని నిజంగా కావలసింది, రాజీ పడినా సరే, ప్రేమించడమెట్లా అన్నది. చలంగారు జీవితకాలం చేసింది అదే.
