మోహన చంద్ర రాత్రి

రాత్రంతా వెన్నెల వాన కురిపించి చంద్రుడు తన పడవని పడమటి వైపు తీసుకుపోతూ ఉన్నాడు. మేమిక్కడ ఉండిపోయామా లేక ఆ పడవలో వెళ్ళిపోయామా? ఉన్నామని చెప్పవచ్చుగాని, ఉండిపోయిన మేమిద్దరం నిన్నటి మనుషులం మాత్రం కాదు.

గోదావరి గలగలలు

ఇందులో సుప్రభాత సుగంధాలు ఉన్నాయి. మధ్యందిన అధ్యయనాలు ఉన్నాయి, సాయంకాల సంధ్యావందనాలు ఉన్నాయి. పూర్వాహ్ణ, మధ్యాహ్న, అపరాహ్ణాలు ఏ ఒక్క రోజువో కావు, అవి అతడి జీవితకాలం మొత్తానికి చెందినవనే సూక్ష్మాన్ని మళ్ళా నేను వాచ్యం చెయ్యనక్కరలేదు.

అత్యున్నత పౌర పురస్కారం

ఆ రోజు ఆ ప్రాజెక్టు అధికారి నన్ను గొయిపాక పంపకుండా విజయనగరం పంపి ఉంటే, నేను నా ఉద్యోగ జీవితంలో నేను మరేదైనా అయి ఉండేవాణ్ణేమో గాని, పాఠశాల విద్య సంచాలకుణ్ణీ, గిరిజన సంక్షేమ శాఖ సంచాలకుణ్ణీ కాగలిగి ఉండేవాణ్ణి కాను.

Exit mobile version
%%footer%%