ప్రతి రోజూ పిల్లలు రకరకాల జానపద, గిరిజన నృత్యాలు చేసారు. వాళ్ళ ఆటలతో, పాటలతో పుస్తక ప్రాంగణం తుళ్ళిపడుతూనే ఉంది. నిన్నటికి కొత్త సంవత్సరం పూర్తిగా ప్రవేశించినట్టనిపించింది!
జయభేరి
ఆ కథ ఏమిటో, ఆ పాత్రలు ఏమి పాడేరో, మాట్లాడేరో నాకేమీ గుర్తు లేదుగానీ, ఆ రాత్రంతా మా మీద ధారాళంగా వర్షించిన వెన్నెల తడి ఇప్పటికీ నా వీపుకి అంటుకునే ఉంది.
తొలి తెలుగు శాసనం
పదిహేడు శతాబ్దాల కింద రాతి మీద చెక్కిన తెలుగు అక్షరాలు తెలుగు సీమలో, తెలుగు నేలమీదనే నిలిచి ఉన్నాయన్న సంగతి విని హృదయం ఉప్పొంగే వాళ్ళు కొందరేనా ఉన్నారు. వారందరూ ఒంటేరు శ్రీనివాసరెడ్డికి కృతజ్ఞులుగా ఉంటారు.
