అసలు తెలుగు సాహిత్యంలో పదిహేనో శతాబ్ది కవులందరిదీ ఒక ప్రత్యేకమైన అధ్యాయం. పిల్లలమర్రి పినవీరన, శ్రీనాథుడు, పోతన, అన్నమయ్య- ఈ నలుగురూ పదిహేనో శతాబ్ది పొడుగునా శృంగార, వైరాగ్యాల మధ్య నలిగిపోయారు.
కళా సాఫల్యం
తెలుగు సాహిత్యచరిత్రను పరిశీలించినా కూడా, తెలుగు నేల రాజకీయంగా అస్థిరత్వం నెలకొన్నప్పుడల్లా యక్షగానం ముందుకొస్తూండటం కనిపిస్తుంది. ఆ అపురూపమైన కళా ప్రక్రియ గురించి తెలుసుకోకపోవడం వల్లా, అందులో రచనలు చేయకపోవడం వల్లా నష్టపోయింది ఆధునిక తెలుగు కవులేనని మరో మారు అర్థమయింది.
ఒక తల్లిదండ్రుల కథ
నాకు కావలసింది మామూలు మనుషులు, పొరుగువాళ్ళని కూడా ప్రేమించనవసరం లేదు, తమ తల్లిదండ్రుల్నీ, తమ పిల్లల్నీ, తమ అన్నదమ్ముల్నీ ప్రేమిస్తో వాళ్ళతో మామూలు సాయంకాలాలు మామూలు మాటల్తో మామూలుగా గడపగలిగే మామూలు మనుషులు కావాలి నాకు.
