స్వర్గం అంచు దగ్గర

మనుషులు కష్టానికీ, చెప్పలేనంత వేదనకీ లోనవడం కళ్ళముందు కనిపిస్తున్నా కూడా ప్రేమానురాగాల మాధుర్యం పలచబడకపోవడం ఆశ్చర్యాల్లోకెల్లా గొప్ప ఆశ్చర్యం.

నాకొక బెతనీ కావాలనిపిస్తున్నది

ఒక తుపాను రాత్రి, ఆ పల్లెలో, ఆ నిరుపేద అక్కాచెల్లెళ్ళ ఇంటికి ప్రభువు విచ్చేసినప్పుడు, మార్తా వేడివేడిగా రొట్టెలు కాల్చి పెడుతున్నప్పుడు, ఆ పరివారంలో నేను కూడా ఒకడిగా ఉండాలనిపిస్తున్నది.

చర్చ ఒక సాధన

విల్బర్డింగ్ రాసిన పాఠ్యప్రణాళికని నేను చాలా క్లుప్తంగా పరిచయం చేసాను. అతడు తన పుస్తకం ముగిస్తూ ఒక చైనా సామెత ను ఉదాహరించాడు. దాని ప్రకారం 'ఉపాధ్యాయుడు చేసేది తలుపు తెరవడమే. లోపలకి ప్రవేశించవలసింది మాత్రం నువ్వే.'