కాని, బైరాగి బాధ్యత బదులు ప్రేమ గురించి మాట్లాడేడు. నువ్వూ, నీ తోటి మానవుడూ భగవంతుడి బిడ్డలు కాబట్టి మీరు ఒకరినొకరు ప్రేమించుకోవాలనడం పూర్వయుగాలు చెప్పిన మాట. నీ తోటిమనిషికి సామాజికంగా, ఆర్థికంగా, సాంస్కృతికంగా అన్యాయం జరుగుతోంది కాబట్టి నువ్వతణ్ణి ప్రేమించాలనడం ఆధునిక యుగాలు చెప్తున్న మాట.
సీసపద్యం
కాని నా వరకు నేను సీసమనే అంటాను. అవును, పదహారణాల తెలుగు ఛందోవిశేషం సీసపద్యమే. తెలుగు పద్యరూపాలన్నిటిలోనూ పెద్దది కావడం వల్లనే కాదు, అంత versatility ఉన్న ఛందస్సు ప్రపంచభాషల్లోనే మరొకటి కనిపించదు.
కాలం నుంచే తపస్సు
సృష్టిలో ఉన్న ఒక లయ, దాన్నే 'ఋతం' అన్నారు, సూర్యాస్తమయాలు, దివారాత్రాలు, ఋతువులు, సంవత్సరాలు, ఆ లయానుగుణంగా జీవించడమే వాళ్ళు కోరుకున్నది. అలా జీవించిందే ఋతం, అది కానిదంతా 'అనృతం'
