ఎమ్మెస్ తన కవితాసంపుటి 'శబ్దభేది'కి ముఖచిత్రం వెయ్యమని అడిగినప్పుడు ఒక పువ్వూ, దానిమీద వాలిన ఒక సీతాకోకచిలుకా స్ఫురించాయి. వాటిని నీటిరంగుల్లో ఎమిల్ నోల్డె లాగా చిత్రించాలని కూడా అనిపించింది.
మోండ్రియన్ పూల బొమ్మలు
ఇప్పటి మన చిత్రకారులెవ్వరూ పూలబొమ్మలు గియ్యరు. ప్రసిద్ధ ఆధునిక తెలుగు చిత్రకారులు గీసిన పూలబొమ్మలేవీ నేను చూడలేదు. పూలబొమ్మలు గియ్యడం కూడా figurative art కిందకే వస్తుందనీ, అది చాలా తక్కువస్థాయి చిత్రకళ అనీ ఆధునిక చిత్రకారులు భావిస్తూండవచ్చు. ఆకృతిని నిరాకరించి, నైరూప్యం వైపు ప్రయాణం మొదలయ్యాక, తమ మనోసీమలో ఘూర్ణిల్లే రకరకాల విరూపాకృతులకి వ్యక్తీకరణనివ్వడమే తమ సాధనగా,తమ కళాసాఫల్యంగా భావిస్తున్నారు మన చిత్రకారులు.
చేర్యాల ఒక సౌందర్య విశేషణం
చేర్యాల మరీ నేనూహించుకున్నంత చిన్న ఊరు కాదు. ఒకప్పటి తాలూకా కేంద్రమని కూడా తెలిసింది. తారురోడ్లూ, ప్రభుత్వాఫీసులూ, పెట్రోలు బంకూ, మన పెద్ద గ్రామాల్లోనూ, చిన్న పట్టణాల్లోనూ కనవచ్చే నిరర్థకమైన తీరికదనం- ఒక్క రెండు కుటుంబాలు మినహా. చేర్యాల అనే ఒక నామవాచకాన్ని సౌందర్య విశేషణంగా, ఒక చిత్రలేఖన శైలిగా మార్చేసిన ఆ రెండు కుటుంబాలు మినహా.
