యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ గారు బైరాగి కవిత్వాన్ని ఇష్టపడతారనీ, బైరాగినీ,ముక్తిబోధ్ ని పోలుస్తూ పరిశోధన చేసారనీ తెలుసు నాకు. కాని బైరాగి కవిత్వాన్ని ప్రాణాధికంగా ప్రేమిస్తారని మొన్నే తెలిసింది నాకు.
ఆ రెండూ కలిసి ఒక జ్ఞాపిక
ఇప్పుడు కృష్ణా జిల్లా రచయితల సంఘంవారు 2015 సంవత్సరానికి ఆలూరి బైరాగి పురస్కారం నాకు అందించినప్పుడు మళ్ళా అట్లానే అనిపించింది. ఆ సంకల్పం లక్ష్మీప్రసాద్ గారిదో, పూర్ణచంద్, గుత్తికొండ సుబ్బారావుగార్లదో అనుకోవడం లేదు నేను.
