పునర్యానం

ఆధునిక జనజీవితపు తొక్కిడిలో, అలజడిలో, ఆందోళనలొ, అస్తిమితంలో ఓ మహాకావ్యనిర్మాణం జరగటమనేది ఒక గొప్ప ఆశ్చర్యకరమైన సంఘటన. దాన్ని నిజం చేసింది పునర్యానం. ఈ నిర్మాత చినవీరభద్రుడు. ఈయన రచనలన్నీ సహృదయునికి ప్రేమలేఖలే.

నేను తిరిగిన దారులు

ఇండియా టుడే తెలుగు పత్రిక కోరికమీద వాడ్రేవు చినవీరభద్రుడు ఆంధ్రప్రదేశ్ లోని గిరిజన ప్రాంతాలైన అరకులోయ, శ్రీశైలం,భద్రాచలం ప్రాంతాల యాత్రావర్ణనలు రాసారు. ఆ తర్వాత ఇంగ్లాండు సందర్శించినప్పుడు మరొక సమగ్రమైన యాత్రాకథనం వెలువరించారు. ఆ కథనాలకు, మరికొన్ని అనుభవకథనాలు జోడించి 2010 లో వెలువరించిన యాత్రాగ్రంథం 'నేను తిరిగిన దారులు.'