శోకం శ్లోకంగా మారిన మరోకథ

Poetry (2010) సినిమా చూసేటప్పటికి అర్థరాత్రి దాటిపోయింది.కొన్నాళ్ళ కిందట ఒక మిత్రురాలు చెప్పినప్పణ్ణుంచీ చూడాలనుకుంటున్నది నిన్నటికి చూడగలిగాను. సినిమా పూర్తయ్యేటప్పటికి, చెప్పలేని సంతాపమేదో హృదయాన్ని చుట్టుకుపోయింది. సినిమా అదృశ్యమైపోయింది. అప్పటిదాకా చూసిన దృశ్యాలన్నీ కలగలిసి ఒక బూడిదరంగు పొరలాగా మనసుమీద పరుచుకుపోయేయి.