శీలావీ శిల్పరేఖలు

అసలు ముందు ఆ ముఖచిత్రం దగ్గరే నేను చాలాసేపు ఆగిపోయాను. ఎంత రొమాంటిక్ గా ఉంది ఆ ఫొటో! లేపాక్షి శిల్పమంటపంలో కూచుని స్కెచ్ బుక్కు తెరిచిపెట్టుకుని ఒక బొమ్మ గియ్యడానికి ఉద్యుక్తుడవుతూ తన ఎదట ఉన్న శిల్పాన్ని పరికిస్తున్న్న ఆ చిత్రకారుణ్ణి చూసి ఏ కళాకారుడు మోహపడడు కనుక!

నా హీరోల్లో ఆయన కూడా ఉన్నారు

శీలావీర్రాజు గారు వేసిన బొమ్మలు చూస్తే మనకి ఈ విషయమే అర్థమవుతుంది. ఆయన చిత్రలేఖనంలో సమాజం, మనుషులు, దైనందిన జీవితం, సకలవృత్తులూ కనిపిస్తాయిగానీ, బయటి ప్రపంచంలో వాటిచుట్టు హోరుమంటో వినిపించే నాయిస్‌ ఆ బొమ్మల్లో కనిపించదు.

శీలా వీర్రాజు

వీర్రాజు గారిని ఆ తర్వాత ఎప్పుడు చూసినా ఆ తొలినాళ్ళ అద్భుత భావన, ఆరాధభావన నన్ను వెన్నాడుతూనే ఉండేవి. ఇరవయ్యేళ్ళ కిందట వాళ్ళింటికి వెళ్ళాను. అది ఇల్లు కాదు, ఒక కళాకృతి. ఒక అపురూప చిత్ర, శిల్ప సంచయశాల. మళ్ళీ అదే ఆశ్చర్యానుభూతి.