పుస్తక పరిచయం ప్రసంగాల్లో భాగంగా టాగోర్ సాహిత్యం పైన చేస్తూ వస్తున్న ప్రసంగాల్లో ఇది అయిదవది. కిందటి రెండు ప్రసంగాల్లోనూ 1880-1900, 1900-1910 కాలాల టాగోర్ కవిత్వం గురించి ప్రసంగించేను. ఈ ప్రసంగంలో 1910-20 మధ్యకాలంలో టాగోర్ సాహిత్యం గురించి, ముఖ్యంగా The Post Office (1912), The Crescent Moon (1913) కవిత్వ సంపుటుల గురించి ప్రసంగించేను. ఆ ప్రసంగం ఇక్కడ వినవచ్చు.
పుస్తక పరిచయం-13
పుస్తక పరిచయం ప్రసంగాల్లో భాగంగా గత రెండువారాలుగా టాగోరు కవిత్వం గురించి ముచ్చటించుకుంటూ ఉన్నాం. ఆ ప్రసంగాన్ని కొనసాగిస్తూ ఈ రోజు వనమాలి (1913) లో కవిత్వం గురించీ, ముఖ్యంగా చిత్రాంగద (1892) రూపకం గురించీ ప్రసంగించాను. ఈ ప్రసంగం వినడానికి ఈ లింకు తెరవచ్చు.
పుస్తక పరిచయం-12
పుస్తక పరిచయం ప్రసంగాల పరంపరలో భాగంగా గతవారం నుంచి టాగోర్ సాహిత్యం గురించి ప్రసంగిస్తున్నాను. నిన్న ప్రపంచ కవితా దినోత్సవం సందర్భంగా టాగోర్ కవిత్వం గురించి, ముఖ్యంగా, ఆయన కవిత్వసాధనలో మొదటిదశ కవిత్వం (1881-1900) గురించి ప్రసంగించాను.
