గాంధీజీ కవిత్వం అనువదించాడా? అవును. యెరవాడ జైల్లో ఉన్నప్పుడు భారతీయ భక్తికవుల నుంచి ఆయన చేసిన అనువాదాల్ని వివరిస్తూ 'మోహనరాగం' పేరిట వాడ్రేవు చినవీరభద్రుడు 2007 లో చేసిన ప్రసంగం.
సత్యమొక్కటే, దర్శనాలు వేరు గాంధీ, టాగోర్ సంవాదం
స్వాతంత్ర్యోద్యమసంగ్రామ కాలంలో దేశాన్ని జాగృతం చేసిన మహనీయుల్లో మహాత్మాగాంధి, రవీంద్రనాథ్ టాగోర్ ముందువరసలో నిలుస్తారు. గాంధీని టాగోర్ మహాత్మా అని సంబోధిస్తే, గాంధీ టాగోర్ ని గురుదేవ్ అని పిలిచేవారు. కాని, సహాయనిరాకరణోద్యమకాలంలో వారిద్దరి మధ్యా అభిప్రాయభేదాలు తలెత్తాయి. అదొక ఆసక్తికరమైన సంవాదంగా రూపుదిద్దుకుంది.ఆ సంవాదం కూడా జాతిని మరింత జాగృతం చెయ్యడానికే సహకరించింది.
అనాసక్తి యోగం
ఫలితంలో ఆసక్తి నిజానికి చాలా స్థూల రూపం. దాన్ని మనం సులభంగా గుర్తుపట్టగలం. కాని, ప్రతిఫలం ఆశించకుండా, సేవచేస్తున్నామని మనలో మనకు తెలియకుండానే కలిగే సంతోషలవలేశం కూడా మనల్ని బాధిస్తుందని నాకు ఏళ్ళ మీదట అర్థమయింది.
