ఒక రచయిత పుస్తకాల స్టాలు పెట్టుకుని అక్కడికి వచ్చే పాఠకుల్ని స్వాగతించడం ఒక అనుభవం. ఇంత విజువల్ మీడియా రాజ్యమేలుతున్నా, ఇందరు సినిమాతారలు ఇన్ని లక్షలమంది అభిమానుల్ని ఆకర్షించగలుగుతున్నా, ఇంకా, ఒక రచయితని చూడగానే మెరిసే కళ్ళతో అతడితో ఒక ఫొటో దిగాలని కోరుకునే పాఠకుల్ని నేను ప్రతిరోజూ పదుల సంఖ్యలో చూసాను. ..
ఒక అత్యవసర బాధ్యత
అమృతా ప్రీతమ్ ఈ నవల ఎంతో బాధ్యతతో రాసింది. అంతే బాధ్యతతో పూర్ణిమ దీన్ని తెలుగు చేసింది. ఈ రచనని ఆవిష్కరించడం నాకు గౌరవం, కానీ అంతకుమించిన బాధ్యత.
